English | Telugu

బాలయ్య వందవ సినిమా జెక్కన్నతోనా!


ఎప్పుడెప్పుడా అని బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వందవ సినిమాకు అప్పుడే ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. బాలయ్య వందవ సినిమా గురించి స్టార్ డైరెక్టర్ లు పోటి పడుతున్న నేపథ్యంలో ఈ అవకాశం రాజమౌళికి దక్కనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఊహలుగుసగుసలాడే సినిమాతో లేటెస్టుగా హిట్ సాధించిన సాయి కొర్రపాటి ఈ సినిమాకు నిర్మాత అని, వారాహి పతాకంపై ఈ చిత్రం నిర్మించే అవకాశాలున్నాయని సినీవర్గాలు అనుకుంటున్నాయి.
సత్యదేవ్ అనే కొత్త దర్శకుడితో బాలకృష్ణ తన 99 వ సినిమా మొదలుపెట్టేశారు. ఇప్పుడు బాలకృష్ణ వందవ సినిమా పైనే అందరి దృష్టి. ఈ సినిమా రాజమౌళి చేతిలో రూపుదిద్దుకోవాలంటే చాలా సమయం పడుతుండవచ్చు. బాహుబలి చిత్రం 2015 ఏప్రిల్ లో విడుదల అని ప్రకటించిన రాజమౌళి బాలయ్య వందవ సినిమా పనులు చేపట్టాలంటే ఎంత సమయం పడుతుందో మరి!
బాలయ్య అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే అంచనాలు బాగా వున్నాయి. ఇక బాలయ్య బాబు తన వందవ సినిమా ఆదిత్య 369 లాంటి సైఫై సినిమా అయితే బాగుంటుందని అనుకుంటున్నారట.