English | Telugu

వర్మ మళ్లీ అదే సినిమా తీశాడట

రామ్ గోపాల్ వర్మ తన సినిమాలను తానే రీమేక్ చేస్తుంటాడని అంటుంటారు. ఇప్పుడు లేటెస్టుగా రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న చిత్రం 'ఐస్‌క్రీమ్' విడుదలకు సిద్ధంగా వుంది. ఈ చిత్రం ఆయన గతంలో నిర్మించిన ‘కౌన్’సినిమాకు దగ్గరదగ్గరగా వుంటుందట. ఊర్మిళ నటించిన ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్. 'ఐస్‌క్రీమ్' ‘కౌన్’ చిత్రాల తీరు ఒకేలా వుండొచ్చనే టాకు అప్పుడే మొదలైంది. ఐస్‌క్రీమ్ సినిమా ట్రెయిలర్ చూసిన వారికి ‘కౌన్’ చిత్రం గుర్తుకు రావడానికి కారణాలు అనేకం వున్నాయి. 'ఐస్‌క్రీమ్' ‘కౌన్’ చిత్రాల్లో ప్రముఖంగా రెండు క్యారెక్టర్లే వుంటాయి. 'ఐస్‌క్రీమ్' ట్రెయిలర్ లోకూడా రెండు క్యారెక్టర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ‘కౌన్’ చిత్రంలో మనోజ్ తివారీ మేల్ లీడ్ క్యారెక్టర్ లో కనిపించాడు. ఇందులో నవదీప్ ఆ పాత్రలో కనిపిస్తున్నాడేమోనని అనుకుంటున్నారు. అయితే పూర్తిగా 'ఐస్‌క్రీమ్' చిత్రం ‘కౌన్’కి మరో వెర్షనా, కాదా తెలియాలంటే విడుదల వరకూ ఆగాల్సిందే. రెండు నెలల్లో గుట్టు చప్పుడు కాకుండా 'ఐస్‌క్రీమ్' సినిమా షూటింగ్ పూర్తి చేసి జూలైలో విడుదలకు సిద్ధం చేసాడు వర్మ. యంగ్ గర్ల్ తేజస్విని గ్లామర్ ని ఈ సినిమాలో బాగానే వాడినట్లు తెలుస్తోంది. ఏమైనా, ఇలా తన సినిమాను తానే ఎక్కువ సార్లు రీమేక్ చేసుకున్న వర్మ, ఈ రీమేకులలో కొత్త రికార్డు సాధిస్తారేమో అనిపిస్తుంది.