English | Telugu
ఆ నాటి వెంకటేష్ మధురస్మృతులు!
Updated : Jul 1, 2014
బెల్లంకొండ సురేష్ తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అల్లుడు శ్రీను’. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత ఐటం సాంగ్ లో కనిపించనుంది. ఈ చిత్రం ఆడియో కార్యక్రమం అతిరధ మహారధుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రామానికి ముఖ్య అతిధిగా వచ్చిన విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ... బెల్లంకొండ సురేష్ తన కొడుకు కోసం చేసిన ఈ ఫంక్షన్ చూస్తుంటే నాకు నా మొదటి సినిమా ఫంక్షన్ గుర్తుకు వస్తుంది. ‘నా మొదటి సినిమా సమయంలో కూడా నాన్నగారు చాలా గ్రాండ్ ఫంక్షన్ చేసి, అందరి సెలబ్రిటీల మధ్య గ్రాండ్ గా నన్ను లాంచ్ చేసారు అంటూ ఆ నాటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు వెంకటేష్.