English | Telugu

దాసరి మనవడిగా మోహన్‌బాబు కొడుకు


దాసరి నారాయణరావు చాలా కాలం తర్వాత తెరపై కనిపించబోతున్నారు. నటుడు, దర్శకనిర్మాత దాసరి నారాయణరావు ఈ సారి తాతగా ఒక చిత్రంలో నటించబోతున్నారని సమాచారం. ఆయనే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మనవడిగా విష్ణు నటించనున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబుకి సినీ గురువైన దాసరితో మంచువిష్ణు నటించడం ఇదే ప్రథమం. మోహన్‌బాబుకి సినిమాలలో తొలి అవకాశం ఇచ్చిన దాసరితో మంచు విష్ణు కలిసి నటించడం, చిత్రానికి దాసరి స్వయంగా దర్శకత్వం చేయడం ఈ వార్తలు ఇప్పుడు ఫిలింనగర్‌లో సందడి చేస్తున్నాయి.