English | Telugu

ఈ ఆటో ప్రస్థానం ఎటో..


ఎన్నో చిక్కులు, అడ్డంకులు దాటుకుని థియేటర్ కు చేరుకున్న ఆటోనగర్ సూర్య చిత్రం దేవకట్టా అభిమానులను ఆకట్టుకున్నట్లే కనిపిస్తోంది. ఆలోచనాత్మక సంభాషణలకు ప్రాణం పోయగలరని ప్రస్థానం సినిమాతో నిరూపించుకున్నారు దేవకట్టా. ఆటోనగర్ సూర్యలో కూడా అలాంటి చిక్కటి డైలాగ్ పంథాను కొనసాగించారు. ప్రస్థానం సినిమాలో కీలక పాత్ర పోషించిన సాయికుమార్ ఈ చిత్రంలో కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. హీరోయిన్‌ తండ్రిగా కనిపించిన సాయికుమార్ పాత్రకు రకరకాల షేడ్స్ వున్నాయి. మాస్ ఆడియెన్సుకు దగ్గరయ్యే నటనతో నాగచైతన్య మెప్పించాడనే చెప్పాలి. తెలుగు సినిమాల్లో స్త్రీ పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వటం విషయంలో వుండే లోపం ఇక్కడా కనిపించింది. అక్కడక్కడా సమంత నటన పర్లేదనే అనిపిస్తుంది.
నవరసాలు కలిపి చూపాలనే ప్రయత్నంలో కొంత లోటుపాట్లున్నా ఒక సీరియస్ కథను డైరెక్టర్ బాగానే తెరకెక్కించారనిపిస్తుంది. ఓవరాల్‌గా చిత్రంలో వయలెన్సు పాలు కొంత ఎక్కువే అనిపిస్తుంది. మరి ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా వుంటుందో ఇంకా తెలియాల్సి వుంది.