బాషాతో బన్నీని మిక్స్ చేసిన ఎన్టీఆర్
నాన్నకు ప్రేమతో సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ మార్చాడు. గెడ్డం, డిఫరెంట్ హెయిర్ స్టైల్, హై క్లాస్ లుక్‌తో వారెవా అనిపిస్తున్నాడు. ఈ స్టైల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అయితే కొంతమంది అభిమానులు మాత్రం.. ఇది కాపీ స్టైల్ అంటూ పెదవి విరుస్తున్నారు. సన్నాప్ సత్యమూర్తి చిత్రంలో బన్నీ హెయిర్ స్టైల్‌ని ఎన్టీఆర్ అచ్చంగా దించేసినట్టే కనిపిస్తుందని వాదిస్తున్నారు. ఆ పాయింట్లోంచి చూస్తే... అదీ నిజమే అనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ గెడ్డం... బాషాలో రజనీకాంత్‌ని తలపిస్తోందని కూడా చెబుతున్నారు.