English | Telugu

బాషాతో బ‌న్నీని మిక్స్ చేసిన ఎన్టీఆర్‌



నాన్న‌కు ప్రేమ‌తో సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ మార్చాడు. గెడ్డం, డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌, హై క్లాస్ లుక్‌తో వారెవా అనిపిస్తున్నాడు. ఈ స్టైల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అయితే కొంత‌మంది అభిమానులు మాత్రం.. ఇది కాపీ స్టైల్ అంటూ పెద‌వి విరుస్తున్నారు. స‌న్నాప్ స‌త్యమూర్తి చిత్రంలో బ‌న్నీ హెయిర్ స్టైల్‌ని ఎన్టీఆర్ అచ్చంగా దించేసిన‌ట్టే క‌నిపిస్తుంద‌ని వాదిస్తున్నారు. ఆ పాయింట్‌లోంచి చూస్తే... అదీ నిజ‌మే అనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ గెడ్డం... బాషాలో ర‌జ‌నీకాంత్‌ని త‌ల‌పిస్తోందని కూడా చెబుతున్నారు.

ఈ రెండూ మిక్స్ చేసి స‌రికొత్త స్టైల్ అనుకోమంటే ఎలా అంటూ... సెటైర్లు వేస్తున్నారు. ఎన్టీఆర్ పై ఇప్పుడు కాపీ ముద్ర ప‌డినా.. ప్ర‌తి సినిమాలోనూ త‌న‌ని తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకోవ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌న్న‌ది మాత్రం అర్థ‌మ‌వుతోంది. ఆ విష‌యంలో ఎన్టీఆర్‌ని మెచ్చుకోవాల్సిందే. అయితే ఈ సినిమాలో తార‌క్ ఈ గెట‌ప్‌తో ఎంత సేపు క‌నిపిస్తాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వ‌ర‌కూ చూపిస్తే ఓకే.. పూర్తిగా ఎన్టీఆర్‌ని ఇదే గెట‌ప్‌లో చూడ‌డం మాత్రం క‌ష్ట‌మే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.