English | Telugu

కళ్యాణ్‌రామ్‌ ‘షేర్‌’ పూర్తయింది

డైనమిక్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్‌ సమర్పణలో మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘షేర్‌’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. జూలై 5 డైనమిక్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘షేర్‌’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, డిజిటల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత కొమర వెంకటేష్‌ మాట్లాడుతూ ` ‘‘మా హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘షేర్‌’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌, డిజిటల్‌ పోస్టర్‌ను విడుదల చేశాం. నిర్మాతల హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌గారితో సినిమా చెయ్యడం చాలా ఆనందంగా వుంది. ‘పటాస్‌’తో సూపర్‌హిట్‌ సాధించిన కళ్యాణ్‌రామ్‌గారికి ‘షేర్‌’ కూడా మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌గారు ఓ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లోనే రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.

దర్శకుడు మల్లికార్జున్‌ మాట్లాడుతూ ` ‘‘మా ‘షేర్‌’ కళ్యాణ్‌ రామ్‌గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కళ్యాణ్‌రామ్‌గారి కెరీర్‌లో ‘షేర్‌’ ఒక సెన్సేషనల్‌ మూవీ అవుతుంది. నందమూరి అభిమానులు పండగ చేసుకునేలా ఈ సినిమా వుంటుంది. ‘పటాస్‌’ తర్వాత మళ్ళీ కళ్యాణ్‌రామ్‌గారు ఈ సినిమాలో విజృంభించి నటించారు’’ అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.