English | Telugu
చెట్టుకున్న కల్లుకుండను చూసే జనం ఊగిపోతున్నారట!
Updated : Apr 5, 2020
కల్లు కంపౌడ్ తెరుచుకోవడం లేదు. చెట్టు దగ్గర చుక్క దొరకడం లేదని మందుబాబులు తెగ ఇబ్బందిపడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కునే పనిలో పడ్డారు. మత్తుకు అలవాటు పడిన వీరు తమకు తోచిన రీతిలో మందు కోసం తంటాలు పడుతున్నారట. చెప్పుకుంటే సిగ్గు పోతుంది.. చెప్పకుంటే ప్రాణం పోతుంది అన్నట్లుగా పల్లెల్లో పరిస్థితి వుంది.