English | Telugu
కేరీ సైమండ్స్‌తో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సహజీవనం చేస్తున్నారు. దీన్ని వీరిద్దరు ఇంతకుముందే ధ్రువీకరించారు. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే కేరీ పది రోజుల కిందట జాన్సన్ తో బెడ్ ను పంచుకుందట. క్వారెంటైన్లో కూడా శృంగారంలో పాల్గొన్నారట.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కరోనా లక్షణాలు తీవ్రం కావడంతో ఆయన్ను ఐసీయూకు తరలించారు. లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో ఉచిత భోజన కేంద్రాలు, నైట్ షెల్టర్ల వివరాలను గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ సెర్చింజన్ల ద్వారా తెలుసుకునే ఏర్పాట్లు గూగుల్ చేసింది. ఇప్పటికే 30 నగరాల్లో ఈ వివరాలు అందుబాటులో ఉన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రోజురోజకూ విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం కనిపించడంలేదు. లాక్డౌన్ కారణంగా ఈ నెల 14 వరకు ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏపీలో వెంటిలేటర్ల మీద ఉన్న పేషేంట్స్ ముగ్గురు మాత్రమేనని సీఎం అదనపు ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేష్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 900 వెంటిలేటర్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందనిఆయన చెప్పారు.
దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను సడలించేందుకు ఓ ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర మంత్రులను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో ఆయన ఈ విషయంపై చర్చించారు....
జె సి దివాకర్ రెడ్డి, వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన కరోనా మీద కరుణ చూపలేదు, కరోనా వంటి కష్టమైన పరిస్థితిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదంటూనే, పాపం బాగా పెరిగినప్పుడు.. ప్రకృతి, దేవుడు ఇలాంటిది...
కొనేవారులేక పోవడంతో కర్నూల్ జిల్లాలో పట్టుచీరల నిల్వలు పేరుకుపోతున్నాయి. జిల్లాలో చేనేత కుటుంబాలు 3 లక్షలు పైనే వున్నాయి. అందులో మగ్గం నేసే నేతన్న కుటుంబాలు 60 వేలు పైచిలుకు వున్నాయి....
క్వారంటైన్లో ఉన్న అనుమానితులకు కనీసం 10 శాతం మందిని కూడా పరీక్షించలేదట. తెలంగాణలో 26,586 మంది విదేశీ ప్రయాణీకులు, వారి పరిచయాలు కలిగి క్వారంటైన్లో వున్నారు. వారిలో కేవలం 2400 మంది...
హైదరాబాద్ పోలీసు డిపార్ట్మెంట్లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. సైఫాబాద్ పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ స్టేషన్లో పని చేసే 12 మంది సిబ్బందిని క్వారంటైన్‌కి పంపారు...
తెలంగాణలో 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే పూర్తిగా కోలుకున్న 45 మందిని డిశ్చార్జ్ చేశారు. కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 11 మంది చనిపోయారు....
15వ తేదీ తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. మరో రెండు వారాలు లాక్డౌన్ పెంచమని ముఖ్యమంత్రి సూచించారు. దేశంలో కరోనా కంట్రోల్లో వుందంటే లాక్డౌన్ వల్లే సాధ్యం అయింది ఆయన అభిప్రాయపడ్డారు.
కరోనా వ్యాధి నిరోధక చర్యల పట్ల ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని, ప్రజలకు జవాబుదారీతనంతో సేవలు అందించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఎపి ప్రభుత్వానికి హితవు పలికారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన 266 కేసుల్లో 243 ఢిల్లీకి వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్టులేనని అధికారులు వెల్లడించారు. కోవిడ్ –19పై ఈ రోజు సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్ష లో...
ఆర్థికంగా నష్టపోయినా పర్వాలేదు. కానీ ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యం. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సర్వే ప్రకారం జూన్ 3వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగించాలి. పాజిటివ్ కేసుల సంఖ్య భారత్‌లో విపరీతంగా పెరగనుందని సర్వే హెచ్చరించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.