English | Telugu
Jayam serial: శకుంతల ముందు గంగని ఇరికించడానికి వీరు కొత్త ప్లాన్!
Updated : Dec 28, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -153 లో శకుంతల కింద పడిపోవడంతో తనని కాపాడానికి గంగ తన ఛాతిపై నొక్కుతూ ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ వస్తుంది.
శకుంతల దగ్గరికి గంగ వస్తుంటే.. ఎందుకు వస్తున్నావ్ గంగ.. అత్తయ్య ఆ పరిస్థితిలో ఉంటే తనని ఉక్కిరి బిక్కిరి చేసావని ఇషిక అంటుంది. ఎందుకు అలా అంటున్నారు.. తను అలా చేసింది కాబట్టి ఇప్పుడు ఇలా శకుంతల గారు బాగున్నారని డాక్టర్ చెప్తుంది. నాకు తెలిసిన వాళ్ళకి ఇలాగే జరిగితే అలా చేశారు అందుకే చేసానని గంగ అంటుంది. థాంక్స్ గంగ.. నువ్వు కాపాడింది ఇద్దరిని అని పెద్దసారు ఎమోషనల్ అవుతాడు.
మరొకవైపు, ఇక లాభం లేదు.. నేను మా ఆయన కలిసి వేరొక కాపురం పెడుతాం.. అనుకున్నది ఏం అవట్లేదు.. అందరు గంగ మాయలో పడిపోయారని వీరుతో ఇషిక అంటుంది. ఎందుకు అలా హోప్ వదిలేసుకుంటున్నావ్ వెయిట్ చెయ్ అని వీరు అంటాడు.
ఆ తర్వాత శకుంతల దగ్గరికి పెద్దసారు వస్తాడు. నువ్వు గంగని మొదట్లో ఎలా చూసావ్.. నిన్ను మాములు మనిషిని చేసిందే తను. ఎందుకు తన పట్ల ఇలా మారావు కారణం తెలియదు కానీ గంగ చాలా మంచిది అని పెద్దసారు చెప్తాడు.
ఇంట్లో ఒక ఇషిక, వీరు తప్ప అందరూ గంగ గురించి పాజిటివ్ గా మాట్లాడుతారు. అప్పుడే పారు వస్తుంది. ఏంటి అందరు ఇలా ఉన్నారు. నాకు అర్ధం అయింది మీరు నా గురించి ఆలోచించకండి. గంగని కోడలుగా ఒప్పుకోండి అని పారు అంటుంది. పెద్దసారు గంగని పిలిచి శకుంతల దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు.
శకుంతల దగ్గర గంగ ఆశీర్వాదం తీసుకోవడానికి తన కాళ్లపై పడుతుంది. తనని ఆశీర్వదించబోతుండగా.. అప్పుడే గంగకి తెలిసిన అన్నయ్య వచ్చి.. గంగ నువ్వు లక్కీ అసలు నువ్వే ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టావని తెలిసినా ఏం అనట్లేదు.. నువ్వు రుద్ర సర్ తో ఫోటో తీస్తానంటే అది నేనే ఇచ్చాను కదా అని అతను అనగానే గంగ షాక్ అవుతుంది. ఏం అంటున్నావ్ అన్న అని అనగానే అయ్యో ఇంట్లో తెలియదా సారీ గంగ చెప్పేసాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.