English | Telugu

చెఫ్ జీవన్ కి ముద్దు పెట్టేసిన దీపికా...

చెఫ్ మంత్ర కుకింగ్ షో ప్రతీ వారం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం కూడా కంటెస్టెంట్స్ జడ్జెస్ అంతా కూడా ఫేమస్ మూవీ రోల్స్ గెటప్స్ లో వచ్చారు. ఇక ఈ షోకి శంబాలా మూవీ టీమ్ వచ్చింది. ఆది కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసాడు. ఇక సుమా ఐతే ఈ షోలో లేలేత లవ్ స్టోరీ నడుస్తోందని అది కూడా దీపికా-జీవన్ మధ్య అని చెప్పేసరికి "శృంగార వీర" అనే సాంగ్ పాడుతూ వచ్చి దీపికా జీవన్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేసింది. ఏదైనా అందరూ కలిసి దీపికను రెచ్చ్చగొట్టారు అంటూ జీవన్ అన్నాడు. "ఏదో మేమందరం ఇక్కడ ఉండి జీవన్ ని కాపాడుతున్నాం కానీ లేదంటే జీవన్ కి ఈపాటికి నలుగురు పిల్లలు ఉండేవారు" అంటూ సుమ కామెడీ చేసింది.

ఇక అందరూ కుకింగ్ చేస్తూ ఉండగా హీరో ఆది వెళ్లి "మీకు జీవన్ గారిలో ఎం నచ్చిందండి" అంటూ దీపికను అడిగాడు. "వయసైనా ఆయన గుండు మాత్రం అలానే ఉంది చూసారా ఆ గుండు నచ్చింది. ఆయన స్టైల్ నచ్చింది. ఆయన నడిచేటప్పుడు వెనక ఆయన తిప్పే నడుము నచ్చింది." అని చెప్పింది దీపికా. వెంటనే ఆది "కాదన్నా నీలో ఇంత రొమాన్స్ ఉందా" అంటూ జీవన్ ని అడిగాడు. " సర్ ఆయనలో ఉన్నది రొమాన్స్ మాత్రమే వేరేం లేదు" అంటూ దీపికా క్లారిటీ ఇచ్చింది. తర్వాత "మీసాల బావా" అంటూ జీవన్ కోసం పాట కూడా పాడింది. ఇక జీవన్ దణ్ణం పెట్టేసి నా కొంపలంటుకుపోతావ్ నన్ను వదిలేయ్ అంటూ నవ్వాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.