English | Telugu

'వార్-2' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇంత ఖర్చు చేశారా..!

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించడంతో 'వార్-2'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయిన ఖర్చు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. (War 2)

'వార్-2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 10న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చిన ఈ వేడుకలో ఎన్టీఆర్, హృతిక్ సందడి చేశారు. 'వార్-2' రిజల్ట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న ఎన్టీఆర్.. కాలర్ ఎగరేసి మరీ ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ ఈవెంట్ కి అయిన ఖర్చు గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వేడుకకు ఏకంగా రూ.1.7 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ ఖర్చుతో ఓ చిన్న సినిమా తీయొచ్చు అని చర్చించుకుంటున్నారు.

భారీగా ఖర్చు అయినప్పటికీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల 'వార్-2'పై మరింత బజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. దాని వల్ల ఓపెనింగ్స్ పెరిగే అవకాశముంది. ఆ తర్వాత చూస్తే మాత్రం.. ఈవెంట్ కోసం రూ.1.7 కోట్లు ఖర్చు చేయడం వల్ల నష్టమేమీ లేదని చెప్పవచ్చు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.