English | Telugu

కూలీ సినిమాలో రోలెక్స్.. లోకేష్ మాస్టర్ ప్లాన్..!

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(LCU)కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ యూనివర్స్ లో భాగంగా ఇప్పటిదాకా 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' సినిమాలు వచ్చాయి. ఆగస్టు 14న విడుదల కానున్న 'కూలీ' సినిమా LCUలో భాగమా కాదా? అనేది త్వరలోనే తేలిపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రోలెక్స్ తరహా పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది.

'విక్రమ్'లో కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషించినప్పటికీ.. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ పాత్రలకు కూడా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో రోలెక్స్ పాత్రతో సూర్య సర్ ప్రైజ్ చేశాడని చెప్పవచ్చు. సినిమా అంతా ఒకెత్తయితే.. రోలెక్స్ పాత్ర మరో ఎత్తు అన్నట్టుగా నిలిచింది. ఇప్పుడు 'కూలీ' మూవీలో కూడా రోలెక్స్ తరహా పాత్రను లోకేష్ డిజైన్ చేసినట్లు సమాచారం.

రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న 'కూలీ'లో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఆమిర్ పాత్ర కూడా రోలెక్స్ తరహాలోనే క్లైమాక్స్ లో వచ్చి, అదే స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంటుందట. విక్రమ్ లో సూర్య మ్యాజిక్ చేసిన స్థాయిలో.. కూలీలో ఆమిర్ కూడా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.