English | Telugu

కింగ్ నాగార్జున రెమ్యునరేషన్ ఇదేనా!

కింగ్ 'నాగార్జున'(King Nagarjuna)ఈ నెల 14 న 'రజనీకాంత్'(Rajinikanth)తో కలిసి 'కూలీ'(Coolie)తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. పైగా తన కెరీర్ లో ఫస్ట్ టైం 'కూలీ'లో  విలన్ గా చేస్తుండటంతో నాగ్ రోల్ పై అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. స్వయంగా ఇటీవల నాగ్ రోల్ ని ఉద్దేశించి రజనీకాంత్ మాట్లాడుతు 'కూలీ సబ్జెట్ విన్నప్పుడు విలన్ క్యారక్టర్ లో నేనే  చేద్దామని అనుకున్నాను. అంత పవర్ ఫుల్ గా నాగ్ పోషించిన సైమన్ క్యారక్టర్  ఉంటుందని చెప్పాడు. దీన్ని బట్టి నాగ్ క్యారక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ ని అర్ధం చేసుకోవచ్చు.