English | Telugu

ఆది పినిశెట్టికి భారీ ఆఫర్‌.. అతను తప్పుకోవడం వల్లే ఈ ఛాన్స్‌!

2006లో తేజ దర్శకత్వంలో దాసరి నారాయణరావు నిర్మించిన ‘ఒక ‘వి’చిత్రం’ సినిమా ద్వారా టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆది పినిశెట్టి. ఆ తర్వాత తమిళ్‌లో చేసిన ‘మృగం’ ఆదికి చాలా మంచి పేరు తెచ్చింది. దాంతో తమిళ్‌లోనే ఎక్కువ సినిమాలు చేశాడు. తెలుగులో గుండెల్లో గోదారి, మలుపు సినిమాల్లో హీరోగా నటించాడు. దాదాపు 10 సంవత్సరాలు కొనసాగిన కెరీర్‌లో ఆదికి మంచి బ్రేక్‌ రాలేదు. 2016లో అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ చిత్రంలో పవర్‌ఫుల్‌ విలన్‌గా టర్న్‌ తీసుకున్నాడు. ఈ సినిమా అతనికి చాలా మంచి పేరు తెచ్చింది. ఇక అక్కడి నుంచి కొన్ని తెలుగు, తమిళ భాషల్లో హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆదికి ఒక భారీ ఆఫర్‌ వచ్చింది. కార్తీ హీరోగా తమిళ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మార్షల్‌’ చిత్రంలో ఆదికి విలన్‌గా నటించే అవకాశం వచ్చింది. కార్తీ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్‌ కావడం విశేషం. వాస్తవానికి ఈ క్యారెక్టర్‌ కోసం మలయాళ నటుడు నివిన్‌ పాలిని తీసుకున్నారు. ఈ సినిమాలో విలన్‌ డిఫరెంట్‌ గెటప్‌తో ఉంటాడు. నివిన్‌కి డిఫరెంట్‌గా మేకోవర్‌ చేసి విలన్‌గా పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యాడని కాన్ఫిడెన్స్‌ వచ్చిన తర్వాత అతనితో ఒక వీడియో చేసి రిలీజ్‌ చేశారు. చివరికి ఈ సినిమా స్టార్ట్‌ అయ్యే సమయానికి నివిన్‌ డేట్స్‌ అడ్జస్ట్‌ అవ్వకపోవడంతో అతన్ని తప్పించి ఆదిని తీసుకున్నారు. దర్శకుడు తమిళకు వెరీ టాలెంటెడ్‌ అనే పేరుంది. దర్శకుడిగానే కాకుండా నటుడుగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. కార్తీ హీరోగా రూపొందుతున్న ‘మార్షల్‌’ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించాలన్న ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్న తనకి ఈ సినిమా పెద్ద బ్రేక్‌ అవుతుందని నమ్ముతున్నాడు ఆది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.