English | Telugu

ఆగిపోయిన ఎన్టీఆర్ కొత్త మూవీ.. దేవర-2 కాదు!

ఇటీవల 'వార్-2' అనే బాలీవుడ్ ఫిల్మ్ తో ప్రేక్షకులను పలకరించాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న 'డ్రాగన్' షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత 'దేవర-2'తో పాటు త్రివిక్రమ్ ప్రాజెక్ట్, నెల్సన్ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. అలాగే యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఒక సోలో ఫిల్మ్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన 'వార్-2'లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ చేసుకున్నాడు. టాలీవుడ్ స్టార్స్ కి హిందీ సినిమాలు కలసి రావట్లేదు. పైగా సోలో మూవీ కూడా కాదు. దాంతో 'వార్-2'తో ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడనే అభిప్రాయాలు మొదట్లోనే వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఆగస్టు 14న విడుదలైన 'వార్-2'.. డివైడ్ టాక్ తో తెలుగులో ఎన్టీఆర్ స్టార్డమ్ కి తగ్గ వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ ను ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది.

నిజానికి 'వార్-2'తో పాటు యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ ఓ సోలో ఫిల్మ్ కూడా కమిటై ఉన్నాడని గతంలో వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా విషయంలో ఎన్టీఆర్ వెనక్కి తగ్గినట్లు వినికిడి. తన స్టార్డమ్ ని మ్యాచ్ చేయలేని హిందీ సినిమాలు చేయడం కంటే.. సౌత్ దర్శకులతో పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించే సినిమాలు చేయడం మంచిదనే అభిప్రాయానికి ఎన్టీఆర్ వచ్చాడట. అందుకే యశ్ రాజ్ ఫిల్మ్స్ తో ఎన్టీఆర్ సోలో ఫిల్మ్ ఉండకపోవచ్చని సమాచారం.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.