English | Telugu

మరో మెగా వారసుడొచ్చాడు.. ఆనందంలో చిరంజీవి!

మెగా కుటుంబంలో మరో వారసుడు అడుగు పెట్టాడు. మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi బుధవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్త తెలిసి మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 2023 నవంబర్ లో పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. లావణ్య ప్రెగ్నెంట్ అయినట్లుగా ఈ ఏడాది మేలో వారు అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 9న ఆ దంపతులకు మెగా బిడ్డ జన్మించాడు.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో లావణ్య బిడ్డకు జన్మనివ్వగా.. ఈ సంతోష సమయంలో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. హైదరాబాద్ లో 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ షూటింగ్ లో ఉన్న చిరంజీవి కూడా హాస్పిటల్ కి వెళ్లి..మనవడిని ఎత్తుకొని మురిసిపోయారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.