English | Telugu

సితార భారీ పాన్ ఇండియా మూవీ.. ఆ సినిమా ప్రభావమేనా..?

ఇటీవల ప్రేక్షకులకు అలరించి, బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన మైథలాజికల్ యానిమేటెడ్ ఫిల్మ్ 'మహావతార్ నరసింహ'. పెద్దగా అంచనాల్లేకుండా జూలై 25న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. దీంతో 'మహావతార్ నరసింహ' స్పూర్తితో ఇండియన్ సినిమాలో మరికొన్ని మైథలాజికల్ యానిమేటెడ్ ఫిలిమ్స్ రూపొందే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్టుగానే టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ 3D యానిమేషన్ చిత్రానికి శ్రీకారం చుట్టింది. (Vayuputra)

వాయుపుత్రుడు హనుమంతుని కథతో 'వాయుపుత్ర' అనే 3D యానిమేషన్ చిత్రాన్ని తాజాగా సితార ప్రకటించింది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకుడు. చిత్ర ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తున్న శక్తివంతమైన పోస్టర్ కట్టిపడేస్తోంది. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే.. 'మహావతార్ నరసింహ'లా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడం ఖాయమని చెప్పవచ్చు. ఈ చిత్రం 2026 దసరాకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

'కార్తికేయ-2'తో పాన్ ఇండియా ప్రేక్షకులకు అలరించాడు దర్శకుడు చందూ మొండేటి. మరోవైపు సితార సంస్థ బడ్జెట్ విషయంలో రాజీ పడదు. దాంతో ఈ ఇద్దరు కలిసి హనుమంతుని కథని యానిమేషన్ రూపంలో ఎంత గొప్పగా తెరపైకి తీసుకొస్తారనే ఆసక్తి నెలకొంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.