English | Telugu

సాయిధరమ్ తేజ్ ట్వీట్ పై ఫ్యాన్స్ ఖుషి.. నిలబడడానికే పుట్టాను  

సుప్రీంహీరో 'సాయిధరమ్ తేజ్'(Sai Dharam tej)సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది. 2023 లో 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)తో కలిసి 'బ్రో' చేసిన తర్వాత 'సత్య' అనే షార్ట్ ఫిలింలో చేసాడు. ప్రస్తుతం 'సంబరాల యేటిగట్టు'(Sambarala yeti Gattu)అనే మూవీ చేస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో 'హనుమాన్' మేకర్ నిరంజన్ రెడ్డి(Niranjan Reddy)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో 'సంబరాల ఏటి గట్టు' ఏ తరహా సబ్జెట్ తో తెరకెక్కబోతుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఏర్పడింది.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభమయ్యింది. సెప్టెంబర్ 25 అని రిలీజ్ డేట్ ప్రకటించడంతో మేకర్స్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటు వచ్చారు. అందుకు సంబంధించిన అప్ డేట్స్ ని కూడా ఎప్పటికప్పుడు తెలియచేస్తు వస్తున్నారు. కానీ కొంత కాలంగా ఎలాంటి అప్ డేట్ లేదు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతో చిత్రీకరణ అపారనే టాక్ సోషల్ మీడియాలో బాగానే వినిపించింది. మేకర్స్ కూడా ఆ వార్తలపై స్పందించకపోవడంతో, షూటింగ్ ఆగిపోయిందనే అందరు అనుకున్నారు. ఇప్పుడు ఆ వార్తలకి చెక్ పడింది. సంబరాల ఏటిగట్టు క్రూషియల్, పవర్ ప్యాక్డ్‌ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్మిడ్ నుంచి మొదలు కానుందని మేకర్స్ అధికారంగా ప్రకటించారు.

సాయి ధరమ్ తేజ్ కూడా ఎక్స్ వేదికగా 'సంబరాల ఏటిగట్టు' లోని తన పిక్ ని షేర్ చేస్తు 'గందరగోళంలో కూడా నిలబడటానికి పుట్టాను' అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసాడు. నూతన దర్శకుడు రోహిత్ కే పి దర్శకత్వం వహిస్తుండగా, 100 కోట్లకి పైగా బడ్జెట్‌తో తెరకెక్కనున్నట్టుగా తెలుస్తుంది. ఐశ్వర్య లక్షి(Aishwrya Lekshmi)కధానాయికిగా కనిపిస్తుండగా,జగపతి బాబు సాయికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ లోక్ నాద్(Ajaneesh Loknath)సంగీతాన్ని అందిస్తున్నాడు.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.