English | Telugu

దీపావళి పండగను ఇలా జరుపుకోండి.. అందరూ హ్యాపీగా ఉంటారు!

ఎంతో కాలం క్రితమే సినిమాల్లో నటించడం మానేసిన రేణు దేశాయ్‌.. తన అభిమానులతో మాత్రం ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. సందర్భం ఏదైనా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా దీపావళి పండగ సందర్భంగా రేణు పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగ దీపావళి. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తోంది. క్రాకర్స్‌తో సందడి చేసేందుకు సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో సరదాగా క్రాకర్స్‌ కాల్చడం మనం చూస్తున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రేణు పెట్టిన పోస్ట్‌ను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు.

‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పండగను అందరూ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పండగను అందరూ ఎంతో ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. అయితే రాత్రి 9 గంటల తర్వాత భారీ శబ్దాలు చేసే క్రాకర్లు కాల్చకండి. ఎందుకంటే వృద్ధులు, పిల్లలు, మూగజీవాలు ఆ శబ్దాలకు భయపడే అవకాశం ఉంది. ఎక్కువ శబ్దం చేయకుండా కేవలం లైటింగ్‌తో పండగను జరుపుకోవాలని కోరుతున్నాను’ అంటూ పోస్ట్‌ చేశారు రేణు దేశాయ్‌. ఆమె పెట్టిన పోస్టుకు చాలా మంచి స్పందన వస్తోంది. ‘చాలా మంచి విషయాన్ని మాతో షేర్‌ చేసుకున్నారు’, ‘మూగ జీవాల పట్ల మీకున్న ప్రేమను మరోసారి అందరితో షేర్‌ చేసుకున్నారు’ అంటూ రేణు దేశాయ్‌ను అప్రిషియేట్‌ చేస్తున్నారు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.