English | Telugu
విశాల్ శరీరానికి 119 కుట్లు.. వాట్ నెక్స్ట్
Updated : Oct 18, 2025
తమిళ చిత్రరంగంతో పాటు తెలుగు చిత్రరంగంలో సమానమైన ఫాలోయింగ్ కలిగిన హీరో 'విశాల్'(Vishal).యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరైన విశాల్ సుదీర్ఘ కాలం నుంచి ఆ తరహా చిత్రాల్లో నటిస్తు అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు. ఎంతటి రిస్క్ ఫైట్స్ ని అయినా ఎలాంటి డూప్ లేకుండా చెయ్యడం విశాల్ స్పెషాలిటీ. అందుకే యాక్షన్ హీరో అనే టాగ్ లైన్ ని పొందాడు.
రీసెంట్ గా విశాల్ ఒక ప్యాడ్ కాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు సినిమాల్లో ఎంత పెద్ద స్టంట్స్ ని అయినా నేనే స్వయంగా చేస్తాను. డూప్ తో చేయించడం నాకు ఇష్టం ఉండదు. ఆ విధంగా యాక్షన్ సన్నివేశాల్లో ఎలాంటి డూప్ లేకుండా చెయ్యడం వల్ల ఇప్పటి వరకు నా శరీరానికి 119 కుట్లు పడ్డాయని చెప్పుకొచ్చాడు. విశాల్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు వైరల్ గా మారడంతో పాటు సినిమాపై విశాల్ కి ఉన్న ఫ్యాషన్ ని మెచ్చుకుంటు కామెంట్స్ చేస్తున్నారు.
కెరీర్ విషయానికి వస్తే విశాల్ ఈ ఏడాది మదగజరాజ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం విశాల్ లిస్ట్ లో మగుడం, తుప్పరివలన్ పార్ట్ 2 వంటి చిత్రాలు ఉన్నాయి. ప్రముఖ నటి ధన్సిక(Sai Dhanshika)తో విశాల్ కి త్వరలోనే వివాహం జరగనున్న విషయం తెలిసిందే.