English | Telugu

పోటీకి సిద్ధమేనంటున్న "ఎవడు"

రాంచరణ్ హీరోగా నటించిన "ఎవడు" చిత్రాన్ని జూలై 31న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే. అయితే పవన్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం కూడా వారం రోజుల తర్వాత ఆగష్టు 7వ తేదిన విడుదల కానుంది. ఈ విషయంపై "ఎవడు" చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... "ఎవడు" చిత్రం ఎట్టి పరిస్థితిలో జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకుడు వంశీ "బృందావనం" సినిమా సమయం నుండే "ఎవడు" సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు. మా యూనిట్ మొత్తం సంవత్సరంన్నరగా శ్రమ ఫలితమే "ఎవడు" చిత్రం. అయిన 2001 జూన్ 15న బాలీవుడ్ లో "గదర్","లగాన్" చిత్రాలు ఒకేరోజు విడుదలై బ్లాక్ బస్టర్స్ కాలేదా అని అన్నారు.

కానీ అసలు విషయం మాత్రం... పవన్ "అత్తారింటికి దారేది" చిత్ర డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తనకు ఇవ్వకుండా నితిన్ కు ఇవ్వడంతో దిల్ రాజు ఈ విధంగా కావాలనే పవన్ కు పోటీగా "ఎవడు" చిత్రాన్ని విడుదల చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.