English | Telugu
చౌదరి తన 99 వ చిత్రాన్ని స్టార్ట్ చేసాడు
Updated : Jul 15, 2025
తెలుగు, తమిళ చిత్రసీమలో విశేష ప్రేక్షకాదరణ కలిగిన యాక్షన్ హీరో విశాల్(Vishal). అంతే స్థాయిలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో లవ్ అండ్ ఫ్యామిలీ చిత్రాలకి పెట్టింది పేరు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్ బి చౌదరి(Rb choudary). ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో ఒక మూవీ రూపుదిద్దుకోనుండటంతో, అభిమానులతో పాటు ప్రేక్షకులలో సదరు చిత్రంపై ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో నిన్న చెన్నైలో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు ప్రముఖ హీరోలు కార్తీ, ఆర్ బి చౌదరి కొడుకు జీవా పాల్గొని మూవీ విజయం సాధించాలని కోరుకున్నారు. విశాల్ నుంచి వస్తున్న ఈ 35 వ చిత్రంలో వేట్టయ్యన్, రాయన్ చిత్రాల ఫేమ్ 'దూషారా విజయన్'(Dushara Vijayan)హీరోయిన్ గా చేస్తుండగా, రవి అరసు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. గతంలో రవి నుంచి ఐంగారన్, ఈట్టి వంటి విభిన్న కథాంశంతో కూడిన చిత్రాలు వచ్చాయి.
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)కెరీర్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'సుస్వాగతం'తో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన 'ఆర్ బి చౌదరి', ఆ తర్వాత రాజా, సూర్యవంశం, నిన్నే ప్రేమిస్తా, నువ్వు వస్తావని, అన్నవరం, ప్రియమైన నీకు, సింహరాశి, శివరామరాజు, సంక్రాంతి, గోరింటాకు, రచ్చ, గాడ్ ఫాదర్ వంటి పలు చిత్రాలని నిర్మించారు. విశాల్ తో నిర్మిస్తున్న కొత్త చిత్రం సూపర్ గుడ్ కి తమిళ, తెలుగు భాషల్లో కలిపి 99 వ చిత్రం. విశాల్ ఈ సంక్రాంతికి 'మదగజరాజ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.