English | Telugu

విజయ్ పార్టీ పై ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది

ఇళయ దళపతి విజయ్(vijay) కి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.1992 లో వచ్చిన నాలయ తీర్పు అనే మూవీతో మొదలయ్యి నేడు పొలిటికల్ పార్టీ స్థాపించేదాకా వచ్చాడంటే తమిళ నాట విజయ్ ప్రభావం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. తాజా న్యూస్ ఒకటి ఆయన అభిమానుల్లో గందరగోళాన్ని నింపుతుంది.

విజయ్ స్థాపించిన పొలిటికల్ పార్టీ పేరు తమిళగ వెట్రి కజగం. ఈ మేరకు రీసెంట్ గా పార్టీ జెండాని కూడా ఆవిష్కరించాడు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉండటంతో పాటుగా రెండు ఏనుగులు అటు ఇటు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏనుగు సింబల్ పై బహుజన్ సమాజ్ వాది పార్టీ ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేసింది. ఏనుగు గుర్తు తమ పార్టీ గుర్తుని పోలి ఉందని, రాజకీయ నాగరికత తెలియకుండా ఉపయోగించారని ఆరోపిస్తుంది. బహుజన్ సమాజ్ వాది పార్టీ జెండాలో ఏనుగు ఉంటుంది.ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఈ విషయంలో మున్ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే దాంతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.

ఇక జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో విజయ్ తమ పార్టీ గీతాన్ని విడుదల చెయ్యడంతో పాటుగా కులం, మతం, ప్రాంతం ,లింగం పేరుతో జరుగుతున్న వివక్షని తొలిగిస్తానని ప్రతిజ్న చేసాడు.అలాగే ప్రజలకి అవగాహన కలిపించి అందరకి సమన హక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తామని, సమానత్వం అనే సూత్రాన్ని చాలా బలంగా సమర్థిస్తామని అనే విషయాన్ని కూడా తెలియచేసాడు. తమిళ నాడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పిన విజయ్ 2026 లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యబోతున్నాడు. ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం అనే మూవీని చేస్తున్నాడు. సెప్టెంబర్ 5 న రిలీజ్ కాబోతుండగా విజయ్ కెరీర్ లో 68 వ చిత్రం.