English | Telugu
మోహన్ లాల్ రాజీనామా
Updated : Aug 27, 2024
మోహన్ లాల్(mohan lal)నాలుగు దశాబ్దాలపై నుంచి మలయాళ చిత్ర పరిశమ్రలో తనదైన ముద్ర వేస్తు అశేష ప్రేక్షాభిమానులని సంపాదించుకున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ నాట కూడా భారీ ఫ్యాన్స్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. రీసెంట్ గా ఆయన తీసుకున్న నిర్ణయం ఒకటి సౌత్ సినీ ఇండస్ట్రీ లో టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళా నటులపై లైంగిక దాడి జరుగుతుందని జస్టిస్ హేమ కమిటీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఒక నివేదిక ని ఇచ్చిన విషయం అందరకి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం ఇండియన్ చిత్ర పరిశమ్రలో హాట్ టాపిక్ అవ్వడంతో పాటు అదర్ ఇండస్ట్రీ లాంగ్వేజ్ కి చెందిన నటీమణులు కూడా మా దగ్గర కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఒక కమిటీని ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి (అమ్మ) అధ్యక్షుడు గా ఉన్న మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేసాడు. మోహన్ లాల్ తో పాటు వివిధ పదవుల్లో ఉన్న మొత్తం పదిహేడు మంది కూడా రాజీనామా చేసారు. అదే విధంగా చిత్ర మండలి మొత్తాన్ని రద్దు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో వస్తున్న లైంగిక ఆరోణలు దృష్ట్యానే మోహన్ లాల్ రాజీనామా చేసాడు. ఇక మోహన్ లాల్ పూర్తి పేరు మోహన్ లాల్ విశ్వనాధన్ నాయర్. ఇప్పటి వరకు సుమారు నాలుగువందల సినిమాల దాకా చేసాడు. నిర్మాతగా, ప్లే బ్యాక్ సింగర్ గా, దర్శకుడు గా, డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో సేవలు అందిస్తూ వచ్చాడు. ఇక కొంత మంది నటీమణులు లైంగిక ఆరోపణల విషయంలో బహిరంగంగానే కొంత మంది పేర్లు కూడా వెల్లడించారు. ఇపుడు ఆ పేర్లు సంచలనం సృష్టిస్తున్నాయి.