English | Telugu

విజయ్ అప్పుడే అక్కడ "చీఫ్ గెస్ట్‌గా" మారిపోయాడా..?

విజయ్ అప్పుడే అక్కడ

భారతదేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో చిత్ర పరిశ్రమ ఉంది. వేర్వేరు ఇండస్ట్రీలైనా ఒకే రంగం కావడంతో పక్క పరిశ్రమలకు చెందిన హీరోలు, టెక్నీషియన్స్‌తో మంచి రిలేషన్స్ మెయింటెన్ చేస్తూ ఉంటారు. ఒకరి సినిమా ఫంక్షన్లకు ఒకరు రావడమన్నది ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. కోలీవుడ్, శాండిల్‌వుడ్, మల్లూవుడ్‌లకు చెందిన సెలబ్రెటీస్‌తో మనోళ్లకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ముఖ్యంగా కన్నడనాట టాలీవుడ్ హీరోలకు స్టార్ స్టేటస్ ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, పవన్, మహేశ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంది.

ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు కన్నడ హీరోలు వారి ఆడియో రిలీజ్‌లు, మూవీ ఈవెంట్లకు తెలుగు హీరోలను చీఫ్ గెస్ట్‌లుగా ఆహ్వానిస్తుంటారు. తాజాగా మన అర్జున్ రెడ్డి అదేనండి విజయ్‌ దేవరకొండకు బెంగళూరు నుంచి కాల్ వచ్చింది. కన్నడ స్టార్ హీరో గణేశ్ నటించిన చమక్ మూవీ ఆడియో రిలీజ్‌ కార్యక్రమానికి విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. దశాబ్ధాల పాటు వరుస విజయాలు, ఫ్యాన్ ఫాలోయింగ్‌ల వల్ల చిరు, బాలయ్య, పవన్, మహేశ్‌లకు ఈ గౌరవం దక్కితే.. ఒక్క సినిమాతో ఆ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు విజయ్.

ఒకప్పుడు ఉదయ్‌కిరణ్, తరుణ్‌ లాంటి హీరోలకు దక్కిన లవర్ బాయ్ కిరీటం ఇప్పుడు దేవరకొండ నెత్తి మీదకు చేరింది. రోమాన్స్‌లో రొటీనిటీ తగ్గించి కాస్తంత స్పైస్ అండ్ పెప్పర్ కలిపితే తప్ప ఇవాళ్టీ జనరేషన్‌కి ఎక్కదని గ్రహించిన విజయ్ ఆ టైప్ మూవీతో ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అందుకే యూత్‌లో ఆ రేంజ్ క్రేజ్ సంపాదించాడు. ఇక చమక్ ఆడియో ఈవెంట్‌లో తన మాటలతో కట్టిపడేశాడు. దేశానికి సూపర్‌స్టార్లను అందించిన ఘనత కర్ణాటక సొంతమని అలాంటి రాష్ట్రానికి తాను రావడం చాలా సంతోషంగా ఉందని విజయ్ అన్నాడు.