English | Telugu

60 ప్లస్‌లోనూ అదే కమిట్‌మెంట్.. దటీజ్ మెగాస్టార్..!

తెలుగు సినీ పరిశ్రమలో గాడ్ ఫాదర్ అంటూ ఎవ్వరు లేకుండా కేవలం కృషి, పట్టుదలతో మెగాస్టార్‌గా ఎదిగి.. మూడు దశాబ్ధాల పాటు మకుటం లేని మహారాజులా టాలీవుడ్‌ను ఏలారు చిరంజీవి. చేసే పనిలో కమిట్‌మెంట్ చూడాలంటే ఖచ్చితంగా చిరుని చూసి నేర్చుకోమని నేటితరం హీరోలకు చెబుతూ ఉంటారు సినీపెద్దలు. ఇక మెగా హీరోలందరు చిరంజీవినే ఫాలో అవుతూ.. ఆయన చూపిన దారిలోనే నడుస్తున్నారు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 ద్వారా గ్రాండ్‌గా రీఎంట్రి ఇచ్చిన మెగాస్టార్ తన తర్వాతి సినిమా సైరా నరసింహారెడ్డి కోసం రెడీ అవుతున్నాడు.

ఇందులో వారియర్ పాత్ర కోసం వయసును పక్కనబెట్టి మరి.. డైలీ జిమ్ముకెళ్లి గంటల తరబడి కసరత్తులు చేస్తున్నారట. ఫిట్ బాడీతో, పవర్‌ఫుల్ లుక్స్‌తో, కోరమీసం దువ్వుతున్న మెగాస్టార్ పిక్ ఒకటి రీసెంట్‌గా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చిరు కొత్త రూపం చూసి మెగా అభిమానులైతే స్టన్నయిపోతున్నారు. 60 ప్లస్‌లో కూడా ఏం కమిట్‌మెంటబ్బా అంటూ ఆశ్చర్యపోతున్నారట. విజువల్ వండర్‌గా తెరకెక్కునున్న సైరా నరసింహారెడ్డిని కొణిదేల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తుండగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.