English | Telugu
వరుణ్‌తేజ్ తెరంగేట్రం ఎవరితో?
Updated : Jun 12, 2013
మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెరంగేట్రం చేసేందుకు తహతహలాడుతుండడం తెలిసిందే. మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ సినీరంగ ప్రవేశానికి సకల సన్నాహాలు జరుగుతున్నాయి. "కొత్తబంగారు లోకం", "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. వరుణ్‌తేజ్ పరిచయ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారంటూ.. ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల స్థానంలో పూరి జగన్నాధ్ పేరు వినవస్తోంది. రామ్‌చరణ్‌తేజ్‌ను ఇంట్రడ్యూస్ చేసిన పూరి జగన్నాధ్‌తోనే తన కుమారుడు వరుణ్‌తేజ్ ప్రవేశం జరగాలని నాగబాబు కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఈమేరకు నాగబాబు_పూరిల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయని సమాచారం అందుతోంది. మరోవైపు మరో నెల_నెలన్నర రోజుల్లో మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ పరిచయ చిత్రం "రేయ్" విడుదలకానుంది. హీరోగా తన అదృష్టాన్ని రెండోసారి పరీక్షించుకొంటూ.. అల్లు శిరీష్ నటిస్తున్న "కొత్త జంట" సెట్స్‌పైకి వెళ్లింది. ఇలా ఈ మెగా ఫ్యామిలీ ఏమేరకు విస్తరించుకొంటూ పోతుందో చూసి తీరాల్సిందే!