English | Telugu
Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ లాక్.. చిరు, చరణ్ ఏం చేయనున్నారు?
Updated : Oct 25, 2025
ఈ ఏడాది 'ఓజీ' మూవీతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్.. సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు పవన్ కళ్యాణ్.
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయింది. పవన్ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహా శివరాత్రి కానుకగా 2026, ఫిబ్రవరి 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఒకవేళ ఈ డేట్ మిస్ అయితే వేసవిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.
2026 వేసవిలో రామ్ చరణ్ 'పెద్ది', చిరంజీవి 'విశ్వంభర' సినిమాలు విడుదల కానున్నాయి. 'పెద్ది' మార్చిలో రిలీజ్ కానుండగా, 'విశ్వంభర' ఏప్రిల్ లేదా మేలో విడుదలయ్యే అవకాశముంది. ఒకవేళ ఫిబ్రవరి మిస్ అయితే.. ఈ రెండు సినిమాల విడుదల తేదీలకు అడ్డు రాకుండా, కాస్త గ్యాప్ ఉండేలా 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ ని ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది.