English | Telugu

Prabhas: మరో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్..!

ప్రభాస్ సినిమా అంటే భారీతనం ఎంత కామనో, రెండు పార్ట్ లు కూడా అంతే కామన్ అయ్యేలా ఉంది. 'బాహుబలి'తో ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు ప్రభాస్. తన గత రెండు చిత్రాలు 'సలార్', 'కల్కి 2898 AD'లకు పార్ట్-2 లు ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇదే బాటలో ప్రభాస్ నెక్స్ట్ మూవీ 'ది రాజా సాబ్'కి కూడా సీక్వెల్ ఉన్నట్లు తెలుస్తోంది. (The Raja Saab)

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ది రాజా సాబ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. నవంబర్ 5న ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. తాజాగా 'రాజా సాబ్'కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

'ది రాజా సాబ్'కి సీక్వెల్ ఉందని సమాచారం. క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి సంబంధించిన లీడ్ ఇస్తారట. పార్ట్-2 కి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ కి దర్శకుడు మారుతి స్టోరీ లైన్ కూడా చెప్పాడని వినికిడి.

ప్రస్తుతం 'ఫౌజి'తో బిజీగా ఉన్న ప్రభాస్.. నెక్స్ట్ 'స్పిరిట్' చేయనున్నాడు. ఆ తర్వాత 'సలార్-2', 'కల్కి-2'తో పాటు ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. ఈ లెక్కన 'రాజా సాబ్-2'కి చాలా సమయం పట్టేలా ఉంది.