English | Telugu
"బూతు రక్తం" రుచి మరిగారు !
Updated : Jun 27, 2013
మనిషి రక్తం రుచి మరిగిన మృగాలకు మరో జంతువు రక్తం రుచించాట్లుగా.. ఇటీవలకాలంలో "బూతు రక్తం" రుచి మరిగిన కొందరు దర్శకులు, నిర్మాతలు.. మళ్లీ మళ్లీ అవే తరహా చిత్రాలతో సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
"ఈ రోజుల్లో" అనంతరం "బస్‌స్టాప్", "ప్రేమకథా చిత్రమ్"లతో కోట్లు గడించిన మారుతి మరి కొన్ని కోట్లు కొల్లగొట్టేందుకు తాజాగా "రొమాన్స్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలాగే.. "ఒక రొమాంటిక్ క్రైమ్ కథ"తో నాలుగైదు కోట్లు వెనకేసుకున్న ఆ చిత్ర దర్శకనిర్మాత సునీల్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు.. "ఒక పెళ్లి కాని అమ్మాయి ప్రేమకథ" అనే ట్యాగ్‌లైన్‌తో "వెయిటింగ్ ఫర్ యు" అనే చిత్రంతో అన బ్యాంక్ బ్యాలెన్స్‌ను భారీగా పెంచుకునేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నారు. అంతేకాదు.. "నేనేం చిన్న పిల్లనా" అంటూ ఇదే తరహాలో మరో చిత్రానికి కూడా సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. బూతుకు పెద్దపీట వేస్తూ ఆమధ్య వచ్చిన "౩జి లవ్" కూడా నిర్మాతలకు, కొనుగోలుదారులకు కనకవర్షం కురిపించడంతో... ఇప్పుడు ఆ తరహా చిత్రాలు మన తెలుగులో ఇబ్బిముబ్బిడిగా తయారైపోతున్నాయి!