English | Telugu
తుది శ్వాస విడిచిన నటి మంజుల
Updated : Jul 23, 2013
ప్రముఖ నటి మంజుల మంగళవారం ఉదయం చెన్నయ్ లో మృతి చెందారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో దాదాపు 100 సినిమాలలో నటించారు. ఈమె ప్రముఖ నటుడు విజయ్ కుమార్ భార్య. వీరికి ఆరుగురు పిల్లలు. 1969 "శాంతి నిలయం" చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి అలనాటి ప్రముఖ హీరోలందరితో మంజుల నటించింది. వెంకటేష్ హీరోగా నటించిన "వాసు" సినిమాలో మంజుల, విజయ్ కుమార్ లు ఇద్దరు కూడా వెంకటేష్ కు తల్లిదండ్రులుగా నటించారు. వీరి అమ్మాయి శ్రీదేవి కూడా సినిమాలలో నటిస్తుంది.