English | Telugu

కాంతార చాప్టర్ 1 ,కొత్తలోక చాప్టర్ 1 ఎవరు గెలిచారు.. ఒక్క పాయింట్ తేడా అంతే  


-కాంతార చాప్టర్ 1 వ్యూస్ ఎంత?
-కొత్తలోక చాప్టర్ 1 వ్యూస్ ఎంత?
-థియేటర్ లో మాత్రం సంచలన విజయం
-ఆ తర్వాతి ప్లేస్ లో ఎవరున్నారు

కాంతార చాప్టర్ 1(kanthara chapter 1)కొత్తలోక చాప్టర్ 1(kotha lokah chapter 1)ఈ రెండు చిత్రాలు సాధించిన విజయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రెండు భిన్నమైన జోనర్స్ తో తెరకెక్కి పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద విజయదుందుభి మోగించాయి. మేకింగ్, కంటెంట్ పరంగా పాన్ ఇండియా మేకర్స్ ముందు ఎన్నో సవాళ్ళని కూడా ఉంచాయి.ఒకసారి సినిమా చూడటానికే థియేటర్స్ కి ప్రేక్షకులు పెద్దగా రాని ఈ రోజుల్లో రిపీట్ ఆడియెన్స్ ని థియేటర్స్ కి పరుగులు తీయించాయి. దీన్ని బట్టి ఆ చిత్రాలు ఎంత బలమైన ప్రభావాన్ని చూపించాయో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఈ రెండు చిత్రాలు థియేటర్స్ లో తమ జోరుని తగ్గించుకున్న తర్వాత ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చాయి. కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 31 న అమెజాన్ ప్రైమ్ వేదికగా అడుగుపెట్టగా, కొత్త లోక చాప్టర్ 1 కూడా జియో హాట్ స్టార్ వేదికగా అక్టోబర్ 31 నే అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏ చిత్రం ఎక్కువగా ఓటిటి సినీ ప్రేమికుల అభిమానాన్ని చూరగొంటుందనే ఆసక్తి ఏర్పడింది. రీసెంట్ గా ఓటిటి వేదికగా ఎక్కువ వ్యూస్ ని రాబట్టే సినిమాల వివరాలని అందించే ప్రముఖ ఆర్మాక్స్(AArmax)సంస్థ తమ జాబితాని ప్రకటించింది. కాంతార చాప్టర్ 1 (4.1 ) మిలియన్ల వ్యూస్ తో మొదటి స్థానంలో నిలవగా, కొత్త లోక చాప్టర్ 1 (4 ) మిలియన్ల వ్యూస్ తో రెండో స్థానంలో నిలిచింది. ఆసక్తికరంగా ఈ రెండు చిత్రాలు పోటాపోటీగా వ్యూస్ ని రాబట్టడం విశేషం. మిగతా స్థానాల్లో చూసుకుంటే 3.1 మిలియన్ల వ్యూస్ తో మిరాయ్ మూడో స్థానంలో ఉంది. 2.4 మిలియన్ల వ్యూస్ తో ఇడ్లీ కొట్టు నాలుగో స్థానంలో, టైగర్ ష్రఫ్ నటించిన హిందీ మూవీ భాగీ పార్ట్ 4 ఐదవ స్థానంలో ఉన్నాయి.


Also read: కాంత పై కోర్టులో కేసు వేసిన ప్రముఖ హీరో మనవడు.. 14 న రిలీజ్ ఉందా!

ఇలా ఓటిటి వేదికగా సౌత్ చిత్రాలు మొదటి రెండు స్థానాల్లో నిలవడం ఇండియన్ మూవీ లవర్స్ లో సౌత్ చిత్రాల పట్ల చూపిస్తున్న అదరణని అర్ధం చేసుకోవచ్చు. త్వరలోనే కాంతార చాప్టర్ 1 , కొత్త లోక బుల్లి తెర ప్రేక్షకులని కూడా అలరించనున్నాయి.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.