లెజండ్రీ హీరోయిన్ మృతి.. భారతీయ చిత్ర పరిశ్రమకి ఎన్నో సేవలు
on Nov 15, 2025

అగ్ర హీరోలతో జతకట్టిన రికార్డు
అసలు పేరు ఉమా కశ్యప్
తొలి అవకాశం ఇచ్చిన చేతన్ ఆనంద్
మరణానికి కారణం ఇదే
భారతీయ చిత్ర పరిశ్రమని ఏలిన ఎంతో మంది నటీమణుల్లో అలనాటి సీనియర్ నటీమణి 'కామిని కౌశల్'(Kamini Kaushal)కూడా ఒకరు. సిల్వర్ స్క్రీన్ పై ఆమె నటిస్తుంటే అందం, అభినయం పోటీ పడుతు ఉండేవి. అంతలా తన పెర్ఫార్మెన్సు తో మెస్మరైజ్ చెయ్యగల ఒక అద్వితీయ సమ్మోహన శక్తి. పైగా ఆమె పరిచయమైన మొట్టమొదటి చిత్రం 'నీచానగర్'(Neechanagar) ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్(Canes Film Festival)లో ప్రదర్శించడం విశేషం.
మొన్న గురువారం రాత్రి ముంబై(Mumabai)లోని తన నివాసంలో కామిని కౌశల్ మరణించడం జరిగింది. ఈ విషయాన్నీ కుటుంబ సభ్యులు అధికారకంగా వెల్లడి చేసారు. ప్రస్తుతం ఆమె వయసు తొంబై ఎనిమిది సంవత్సరాలు. వృధాప్య సమస్యలు తలెత్తడంతోనే తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. కామిని కౌశల్ అసలు పేరు ఉమా కశ్యప్. తొలుత ఆకాశవాణిలో వచ్చే రేడియో నాటకాల్లో ప్రదర్శన ఇచ్చేవారు. వాయిస్ బాగా పాపులర్ అవ్వడంతో అప్పటికే దర్శక, నిర్మాతగా రాణిస్తున్న 'చేతన్ ఆనంద్' సినిమాల్లో ఆమెకి మొదటి అవకాశం ఇచ్చాడు. ఆ చిత్రమే కేన్స్ ఫిలింఫెస్టివల్ లో ప్రదర్శించిన నీచానగర్. తన పేరుని కామిని కౌశల్ గా మార్చింది కూడా ఆయనే. ఇక అక్కడ్నుంచి ఆమె వెనుతిరిగి చూసుకునే అవసరం లేకపోయింది. తన అద్భుతమైన నటనతో ఎన్నో క్యారక్టర్ లకి సజీవ రూపాన్ని తీసుకొచ్చింది.లెజండ్రీ యాక్టర్స్ రాజ్ కుమార్, దిలీప్ కుమార్, అశోక్ కుమార్, దేవ్ ఆనంద్ ల సరసన నటించిన రికార్డు కూడా ఆమె సొంతం.
Also read: ఐ బొమ్మ నిర్వాకుడు రవి అరెస్ట్.. అసలు ట్విస్ట్ ఇదే
హీరోయిన్ గా తన ప్రస్థానం 1946 నుంచి 1968 వరకు సాగింది. ఆ ప్రయాణంలో ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డ్స్, సన్మానాలు ఉన్నాయి. ఆ తర్వాత 'హర్ దిల్ జో ప్యార్ కరేగా, చెన్నై ఎక్స్ ప్రెస్, లాల్ సింగ్ చద్దా, కబీర్ సింగ్ వంటి పలు చిత్రాల్లో తల్లిగా, బామ్మ గా కూడా కనపడి మెస్మరైజ్ చేశారు. సుమారు తొంబై చిత్రాల వరకు ఆమె లిస్ట్ లో ఉన్నాయి. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. లాహోర్ ఆమె స్వస్థలం కాగా 1927 ఫిబ్రవరి 24 న జన్మించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



