English | Telugu

500 మంది మహిళలకి రొమ్ము క్యాన్సర్ చికిత్స.. డీటెయిల్స్ ఇవే 


-సోను సూద్ మంచి మనసు
-రియల్ హీరో
-రొమ్ము క్యాన్సర్ చికిత్స

సిల్వర్ స్క్రీన్ పై మాత్రమే ప్రతినాయకుడిగా భయపెట్టి ఆఫ్ ది స్క్రీన్ మంచి మనసుతో పది మందికి సాయం చేయడంలో 'సోను సూద్'(Sonu Sood)ముందువరుసలో ఉంటాడనే విషయం తెలిసిందే. ఇప్పటికే తన ఫౌండేషన్ ద్వారా పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంతో మందికి సాయం చేస్తూ వస్తున్నాడు. అందుకే అభిమానులు రియల్ హీరో అనే బిరుదుని కూడా ఇచ్చారు.

రీసెంట్ గా సోను సూద్ మాట్లాడుతు నా ఫౌండేషన్ ద్వారా దేశంలో ఉన్న 500 మంది మహిళలకి రొమ్ము క్యాన్సర్ చికిత్స చేయించాను. ఆ 500 మంది జీవితాన్ని కాపాడి వాళ్ళ జీవితాల్లో సరికొత్త వెలుగుని తీసుకురావడంతో పాటు ఆ కుటుంబాల్లో ఆనందం నింపినందుకు మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందుతున్నాను. సమిష్టి కృషి ద్వారానే ఇలాంటి గొప్ప పనులు జరుగుతాయి. ట్రీట్ మెంట్ చేసిన వైద్యులకి కూడా కృతజ్ఞతలు.భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తాను. త్వరలోనే రొమ్ము క్యాన్సర్ పై మరింత అవగాహన కలిపించే కార్యక్రమాలు చేస్తానని తెలిపాడు.


Also Read:మరో బాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్! ఈ సారి ఆ సూపర్ స్టార్ తో కలిసి!

ఇక సోను సూద్ సినీ కెరీర్ విషయానికి వస్తే ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 10 న బాలీవుడ్ లో 'ఫతే'(Fathe)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోతో పాటు నిర్మాతగాను వ్యవహరించగా సదరు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. కొత్త చిత్రాలేవి ఇంకా అనౌన్స్ చేయలేదు.


పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.