English | Telugu
అవతార్ ఫైర్ అండ్ యాష్ కి షాకింగ్ రివ్యూస్.. ఇచ్చిన సంస్థలు ఇవే
Updated : Dec 17, 2025
-ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి!
-రివ్యూ ఇచ్చింది ఎవరు
-ఈ నెల 19 న ఏం జరగబోతుంది
వరల్డ్ సినీ ప్రేమికుల్లో పండోరా గ్రహంపై మరోసారి 'జేమ్స్ కామెరాన్'(James Cameron)సృష్టించిన 'అవతార్ ఫైర్ అండ్ యాష్'(Avatar Fire and Ash)సందడి వాతావరణం మొదలైంది. ఎప్పుడెప్పుడు థియేటర్ లో కి ఫైర్ అండ్ యాష్ అడుగుపెడుతుందా ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆతృత కూడా వాళ్ళల్లో మొదలైంది. బుకింగ్స్ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీన్ని బట్టి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా ప్రముఖ హాలీవుడ్ రివ్యూస్ సంస్థలైన రోటెన్ టొమాటోస్, ఐజిఎన్ వంటి పాపులర్ సంస్థలు అవతార్ ఫైర్ అండ్ యాష్ పై తమ రివ్యూస్ ని ఇచ్చాయి. మరి ఆ సంస్థలు ఎలాంటి రివ్యూస్ ని చెప్పాయో చూద్దాం.
అవతార్ పార్ట్ 1 ,పార్ట్ 2 ఎలా అయితే విజువల్ గా ఐ ఫీస్ట్ ని కలిగించాయో, పార్ట్ 3 కూడా అలాగే కలిగించింది. ఈ విషయంలో కామెరాన్ మరో సారి సక్సెస్ అయ్యారు. యాక్షన్ సీక్వెన్స్ , టేకింగ్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. కానీ కథలో పెద్దగా బలం లేదు. టెక్నాలజీ పై చూపిన శ్రద్ద ఎమోషనల్ ని పలికించడంలో చూపలేదని సదరు రివ్యూ సంస్థలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ రివ్యూస్ వైరల్ గా మారడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తు కామెరాన్ సినిమాలకి రివ్యూస్ తో సంబంధం ఉండదు. 19 న వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద మ్యాజిక్ జరగబోతుందనే కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో కూడా ఎక్కువ థియేటర్స్ లో విడుదల కానుంది.
Also read:500 మంది మహిళలకి రొమ్ము క్యాన్సర్ చికిత్స.. డీటెయిల్స్ ఇవే
ఇక రీసెంట్ గా కామెరాన్ ఫైర్ అండ్ యాష్ ని ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శించే థియేటర్ టెక్నీషియన్లకు, యజమానులకు ఒక ప్రత్యేకమైన లేఖ రాసారు. సదరు లేఖలో ఈ సినిమాతో పాటు పంపిన డీసీపీ లో ప్రొజెక్షన్ స్పెసిఫికేషన్ ఫైల్, ఫ్రేమింగ్ చార్ట్ ఉన్నాయి. వాటిని తప్పకుండా పాటించాలి. లైట్ లెవల్స్, ఆడియో కాన్ఫిగరేషన్ కూడా ముఖ్యం.సౌండ్ సిస్టమ్ ని నేనే వ్యక్తిగతంగా మిక్స్ చేశాను. పూర్తి అనుభూతి కోసం 7.0 రిఫరెన్స్ సౌండ్ లెవల్‌ని తగ్గించవద్దు. థియేటర్ల నిర్వహణ ప్రేక్షకుల అనుభూతిలో కీలకం.ఆ విషయంలో ఎలాంటి రాజి పడవద్దని చెప్పాడు.