English | Telugu

ఆమె కూడా హీరోయినే...!

ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయినే ప్రేమించాలి అనేంత అందంగా అనిపించినా "హ్యాపీ డేస్" హీరోయిన్ సోనియా. మరి అంత తెల్లగా లేకపోయినా.. కుర్రాళ్ళ గుండెల్లో మంచి అందగత్తెగా పేరు తెచ్చుకుంది.
అయితే సినిమా ఇండస్ట్రీ లో ఏ హీరోయిన్ అయిన కూడా అవకాశాలు వచ్చిన రాకున్నా కూడా ఓ మోస్తారు గ్లామర్ ను మెయింటేన్ చేస్తుంటారు. అందంగా ఉన్నవారు కాస్త నల్లగా కనిపించిన కూడా సూపర్ గా కనిపిస్తారు. మరి అసలే నల్లగా ఉండే సోనియా రోజు రోజుకు తన ఫ్యాషన్ లో ఇండియన్ స్టైల్ ను మించి పోతుంది.

ఇటీవలే జరిగిన 60వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన ఈ అమ్మడిని చూసి ఎవరు కూడా సరిగ్గా గుర్తుపట్టలేరంట.ఇపుడు మీరు చూస్తున్న ఈ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్నది కూడా ఈ అమ్మడే. ఈ విధంగా ఆ అవార్డుల ఫంక్షన్ కు వెళ్లేసరికి అందరూ ఆమెను చూసి కాస్త షాక్ అయ్యారు. అసలే ఈ అమ్మడికి అవకాశాలు లేకపోవడంతో వచ్చిన పాత్రలనే చేసుకుంటూ వెళ్తుంది. మరి ఈ విధంగా తయారవుతే దర్శక, నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం అనే సంగతి పక్కన పెట్టి.. అసలు సోనియా అనే ఒక నటి ఉందనే సంగతి కూడా మర్చిపోతారేమో! కాబట్టి... అమ్మా సోనియమ్మా.. కాస్త అందంగా కనిపించే బట్టలు వేసుకుంటే.. ఏమైనా సినిమా అవకాశాలు వస్తాయి. ఇప్పటికైనా సోనియా తన అందం పై శ్రద్ధ పెడుతుందో లేదో చూడాలి.