English | Telugu

సూపర్ స్టార్‌తో సోనాక్షి మళ్లీ బిజీ

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ లింగా సినిమా షూటింగ్లో బిజీ గా వున్న సోనాక్షి మరో పనిలో కూడా బిజీగా మారనుంది. సూపర్ స్టార్ వలనే మళ్లీ కూడా బిజీగా మారనుంచి సోనాక్షి సిన్హా. అదీ ఒక షార్ట్ ఫిలిం కోసం.. నిజమే అంతపెద్ద స్టార్ ఒక చిన్న కాదు లఘు చిత్రంలో నటించనుంది. ఆ సినిమా పేరేంటో తెలుసా!!! "సూపర్‌స్టార్ ". 8 నుంచి 10 నిముషాల పాటు ఈ వీడియో ఉండనుంది. సూపర్ స్టార్ పేరుతో వస్తున్న మొదటి షార్ట్ ఫిలింలో నటిస్తున్నందుకు సోనాక్షి చాలా సంతోషంగా వుందట. అంతే కాదు తలైవాతో మొదటి సారి కలిసి పనిచేస్తూ ఆయన పనితీరు, ప్రొఫెషనలిజం చూసి ఎంతో రజనీ పై ఎంతగానో గౌరవం పెంచుకున్న సోనాక్షి ఈ వీడియోకి ఆ పేరే పెట్టటం కరెక్టు అని అనిపించిందట. ఇలా రజనీపై వున్న గౌరవాన్ని తెలియచేయాలని కూడా అనుకుంటోందట.