English | Telugu

మహేష్ కి షాకు సూర్యకి కిక్కు


మనం సినిమా దర్శకుడు విక్రమ్‌ గతంలో మహేష్ కు ఒక కథ వినిపించాడట. అది మహేష్ కి నచ్చి ఓకే కూడా చేసాడట. సినిమాను మొదలు పెడదామని మాట కూడా ఇచ్చాడట ప్రిన్స్. ఈ లోపు విక్రమ్
ని కలుసుకున్న సూర్య మనం తరహాలో ఏమైనా కథ వుంటే చెప్పమన్నాడట. తండ్రి, తమ్ముడు తాను కలిసి నటించేందుకు వీలైన కథ కావాలన్నాడట. ఆ సమయంలో విక్రమ్ మహేష్ కి చెప్పిన కథే సూర్యాకి చెప్పాడట. వినివినగానే సూర్యాకి కథ బాగా నచ్చి చిటికెలో ఓకే చేశాడట. వెంటనే తెలుగు, తమిళ భాషల్లో నిర్మించేందుకు షూటింగ్ ఏర్పాట్లు చేసుకుందాం అని కూడా చెప్పేశాడట. ఆగడు సినిమా బిజీలో వున్న మహేష్ కి ఈ విషయం పెద్ద షాకే అని చెప్పాలి. త్వరలో సూర్యా, సమంత కలిసి నటించిన అంజాన్ మూవీ విడుదలకు సిద్ధంగా వుంది.