English | Telugu
మరోసారి ఐటంగాళ్‌గా
Updated : Jul 27, 2013
తొలి సినిమాతోనే బాలీవుడ్‌ని ఒక ఊపేసిన బ్యూటి సోనాక్షి.. శతృఘ్న సిన్హ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఫస్ట్ మూవినే సల్మాన్ సరసన దబాంగ్ సినిమాలో నటించింది.. అంతే కాదు ఈసినిమానే 100 కోట్ల క్లబ్‌లో చేరడంతో లక్కీ గర్ల్ అనిపించుకుంది సోనాక్షి..వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సోనాక్షి కెరీర్ స్టార్టింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్‌పొజింగ్ చేసేది లేదంటూ చాలా కబుర్లు చెప్పింది.. బాలీవుడ్ బాలీవుడ్‌లో ఇలాంటి కట్టుబాట్లేవి కుదరవని కాస్త ఎర్లీగానే తెలుసుకుంది సోనాక్షి..
స్టార్టింగ్‌లో కేవలం చీరల్లోని కనిపించిన ఈ బొద్దుగుమ్మ తరువాత తరువాత కాస్త పట్టు వదిలింది. చీరల్లోనే హాట్ హాట్‌గా కనిపించడం మొదలెట్టింది.. అంతే కాదు మరో అడుగు ముందు కేసి ఐటమ్ సాంగ్స్ కు కూడా సై అంది..ఇప్పడు తాజాగా మరో సారి అక్షయ్ కుమార్ సరసన చేస్తున్న సినిమాలో భారీ ఎక్స్‌పోజింగ్‌కే రెడీ అవుతుందట సోనాక్షి ఇప్పటికే నెట్‌లో దర్శన మిస్తున్న పోస్టర్స్‌తో సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తుంది.. మరి ఇప్పటికే ఇంత చూపిస్తున్న సోనాక్షి ముందు ముందు ఇంకెంత అడ్వాన్స్ అవుతుందో చూడాలి..