English | Telugu

మహేష్ బాబు డై హార్డ్ ఫ్యాన్ మృతి.. ఎస్ కే ఎన్ ఏం చేసాడో తెలుసా!

'బేబీ' మూవీతో నిర్మాతగా బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు 'ఎస్ కే ఎన్'(SKN).ప్రస్తుతం 'ప్రభాస్' అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Rajasaab)కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో సైతం ఎస్ కే ఎన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా సందర్భాల్లో ఎస్ కే ఎన్ మాట్లాడిన మాటలు సదరు సోషల్ మీడియాలో వైరల్ గాను నిలుస్తుంటాయి.

రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబుకి వీరాభిమాని అయిన 'రాజేష్' మరణించడం జరిగింది. దీంతో రమేష్ నాయక్ అనే మరో మహేష్ అభిమాని ఎక్స్ వేదికగా ఎస్ కె ఎన్ కి ఈ విషయాన్ని తెలియచెయ్యడంతో పాటు, చనిపోయిన రాజేష్ కి పది సంవత్సరాల కొడుకు, ఆరు సంవత్సరాల కూతురు ఉంది. ఏదైనా హెల్ప్ చెయ్యమని రిక్వెస్ట్ చేసాడు. ఈ విషయంపై ఎస్ కే ఎన్ స్పందిస్తు 'పిల్లల చదువులు ఆగిపోకూడదు, నేను కూడా ఓ హీరో ఫ్యాన్‌నే. మరొక అభిమాని బాధ నాకు అర్ధమవుతుంది. అందుకే ఆ కుటుంబానికి 2లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నాను. అందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ త్వరలోనే పూర్తిచేస్తా. ఇతరులు కూడా ఎవరికి తోచినంత సాయం ఆ కుటుంబానికి చేయండి’ అని ట్వీట్ చేసాడు. దీంతో ఎస్‌కేఎన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది.. కానీ సాయం చేసే గుణం నీలాంటి మంచి మనసున్న వారికే ఉంటుంది, మీరు మెగా ఫ్యాన్ మాత్రమే కాదు మంచి మనిషి కూడా అంటు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఎస్ కే ఎన్ చిరంజీవి(Chiranjeevi)కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. అల్లు అర్జున్(Allu Arjun)కి సన్నిహితుడు కావడంతో పాటు, అల్లు అర్జున్ సంస్థ గీతా ఆర్ట్స్‌ కి సంబంధించిన వ్యవహారాలు కూడా చూస్తుంటాడు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.