English | Telugu

బ్రేకింగ్‌.. ఆస్కార్‌కి ‘కాంతార చాప్టర్‌ 1’?

ఇటీవల విడుదలైన సినిమాల్లో భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టిస్తున్న సినిమా ‘కాంతార చాప్టర్‌1’. రిషబ్‌ శెట్టి హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతను కూడా చేపట్టి ఒక అద్భుతమైన చిత్రంగా ‘కాంతార చాప్టర్‌1’ను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిందని వార్తలు వస్తున్నాయి. సినిమా చూసిన ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తున్న ఈ సినిమా ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని చోట్ల తన సత్తా చాటుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్‌ ఒక సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అదేమిటంటే.. ‘కాంతార చాప్టర్‌1’ ఆస్కార్‌కి నామినేట్‌ చెయ్యాలని.

మేకర్స్‌ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా నామినేట్‌ చెయ్యాలనే ఆలోచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలోనికంటెంట్‌ను, వివిధ ప్రాంతాలకు సంబంధించిన జీవన శైలిని, జానపద అందాలు, ఆధ్యాత్మిక అంశాలు అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు చక్కని అనుభూతిని కలిగిస్తాయని చిత్ర నిర్మాతలు నమ్ముతున్నారని, అందుకే ఈ సినిమాని ఆస్కార్‌కి నామినేట్‌ చెయ్యాలన్న నిర్ణయానికి వచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మొదట విడుదలైన ‘కాంతార’ సాధించిన సంచలన విజయం గురించి అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై క్రమంగా భారీ హిట్‌ స్థాయికి చేరుకుంది. దానికి ప్రీక్వెల్‌గా రూపొందిన ‘కాంతార చాప్టర్‌ 1’ అంతకు మించిన విజయాన్ని సాధించి ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో రిషబ్‌ శెట్టి పెర్‌ఫార్మెన్స్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆస్కార్‌కి పంపాలనే నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం క్లైమాక్స్‌లో రిషబ్‌ నటనే అని తెలుస్తోంది. తన నటనలో ఆధ్యాత్మిక భావాన్ని, జానపద దేవత భావాన్ని చూపిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది.

హోంబలే ఫిలింస్‌ తీసుకుంటున్న నిర్ణయం సరైనదేనని విషయం తెలిసిన నెటిజన్లు, ప్రేక్షకులు, అభిమానులు అంటున్నారు. సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన చర్చ జరుగుతోంది. మేకర్స్‌ నిర్ణయానికి మద్దతు తెలియజేస్తున్నామంటూ పోస్టులు పెడుతున్నారు. ‘కాంతార’ వంటి సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీని గురించి హోంబలే ఫిలింస్‌ తుది నిర్ణయం తీసుకొని అధికారికంగా దాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.