English | Telugu

కండలు పెంచిన ప్రియాంక


హీరోలు కండలు పెంచి, సిక్స్ ప్యాక్, 8 ప్యాక్‌తో కనిపించడం దశాబ్ద కాలంగా చూస్తువున్నాం. ఇండియన్ సినిమాల్లో కండలు పెంచిన హీరోలు ఎంతో మంది వున్నారు. గ్లామర్‌కి పెద్ద పీట వేసే మన సినిమాల్లో కండలు పెంచిన హీరోయిన్లు ఇప్పటి వరకూ ఎవరూ లేరనే చెప్పాలి. ఆ లోటుని ప్రియాంక చోప్రా భర్తి చేస్తోంది.
తాజాగా ప్రియాంక నటిస్తున్న ‘మేరీ కోమ్’ చిత్రం ఫస్ట్‌లుక్ చూస్తే ఈ విషయం రూఢీ చేసుకోవచ్చు. ఒలింపిక్ విజేత మేరీ కోమ్ నిజజీవిత కథ ఆధారంగా సంజయ్‌లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ ఐదున ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇలా కండలతో కనిపించడానికి ప్రియాంక చాలా కష్టపడిందట.