English | Telugu

అవార్డుల్లో ఆ దారే ఉత్తమం


నా దారి రహదారి అనే రజనీకాంత్ డైలాగ్ వినే వుంటారు. నరసింహా సినిమాలో రజనీ స్టైల్‌గా నడిచి వచ్చి చెప్పే డైలాగ్ సినిమా పరంగా ఎంతో ఆకట్టుకుంది. అయితే ఇక్కడ చెబుతున్నది ఇంకోరకమైన పవర్‌ఫుల్ దారి గురించి.

అది పవన్‌ అత్తారింటికి దారేది సినిమా చేపట్టిన అవార్డుల దారి గురించి. అరవై ఒకటవ ఫిలింఫేర్ అవార్డుల్లో 4 అవార్డులు పవన్ నటించిన ఈ సినిమా వైపే కదిలి వచ్చాయి. అత్తారింటికి దారేది సినిమాకు ఉత్తమ చిత్రంతో సహా మరో మూడు అవార్డులు లభించాయి. త్రివిక్రమ్ ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకోగా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డును ఈ సినిమాకు సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్ దక్కించుకున్నారు. ఈ చిత్రంలో విశేషంగా ఆకట్టుకున్న ఆరడుగుల బుల్లెట్టు పాట రచయిత శ్రీమణి ఉత్తమ పాటల రచయితగా అవార్డు అందుకున్నారు. పవన్ కళ్యాణ్‌ ఈ ఏడాది చేపట్టిన ప్రతి అంశంలో విజయం సాధిస్తున్నారు.