English | Telugu

ఇదిగో స్పైసీ ఐస్‌క్రీం-2 ఫస్ట్‌లుక్


ఒక ఐస్‌క్రీం థియేటర్‌కి చేరీ చేరగానే రెండవది రెడీ అంటున్నారు రాంగోపాల్ వర్మ. సంచలనాలు సృష్టించడంలోనే కాదు సినిమాలు వేగంగా పూర్తి చేయడంలోనూ ఆయన సిద్ధహస్తులు. గతంలోనూ 2, 3 నెలల వ్యవధిలో వెంట వెంటనే చిత్రాలు నిర్మించి విడుదల చేశారు. ఇప్పుడు ఐస్‌క్రీం చిత్రం విడుదలై వారం రోజులు కూడా గడవక ముందే ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారని ప్రకటించారు. ప్రకటించిన వెంటనే ఈ సినిమా ఫస్ట్‌లుక్ కూడా ప్రత్యక్షమయింది.

సెప్టెంబర్‌లో విడుదల అంటూ ఆ పోస్టర్‌లో డేట్ కూడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే టాలీవుడ్‌లో పేరున్న దర్శకులు, సంవత్సరానికి, ఒకటి అర చిత్రాలు రూపొందిస్తూ ఆయాస పడుతున్నారు. అలాంటిది వర్మ ఇలా వెంటవెంటనే చిత్రాలు, చడీ చప్పుడు కాకుండా రూపొందిస్తున్నారు. సినిమా మేకింగ్‌లో ఆర్‌జీవీ వేగాన్ని అందిపుచ్చుకునేవారు ఇప్పట్లో ఎవరూ లేరనే చెప్పాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.