English | Telugu

పెళ్ళికి సిద్దమైన "వాలు" జంట?

తమిళ లిటిల్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శింబు ప్రేమాయణం ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. గతంలో నయనతారతో కలిసి ప్రేమాయణం నడిపిన శింబు, ఆ తర్వాత నయనతారకు దూరం అయ్యాడు. ఆ తర్వాత శింబు చాలా మంది హీరోయిన్ లతో ప్రేమాయణం సాగించాడు. అయితే ఈ మధ్య శింబు ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయంట. దానికి కారణం ముద్దు గుమ్మ హన్సిక.

అవునండి! వీళ్ళిద్దరూ కలిసి నటించిన తాజా తమిళ చిత్రం "వాలు". అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో వీరిద్దరూ బాగా దగ్గరయ్యారని తెలిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం.... శింబు త్వరలోనే హన్సికను పెళ్లి చేసుకోబోతున్నాడట. వీరి పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారని తెలిసింది.

ఇటీవలే శింభు తండ్రి టి.రాజేందర్ మాట్లాడుతూ.. "నా కొడుకు ఎవరిని ఇష్టపడితే వారిని ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. హన్సికను పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూడా మేం ఏమి అనము" అని చెప్పాడు. అంటే త్వరలోనే వీరి పెళ్లి కానుందని చెప్పకనే చెప్పారు.

అయితే శింబు ప్రస్తుతం తన చెల్లి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. అదే విధంగా హన్సిక కూడా కొన్ని తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. ఈ చిత్రాలన్నీ పూర్తయిన తర్వాత వీరు పెళ్లి చేసుకుంటారని తెలుస్తుంది.