English | Telugu

డ్రెస్ చింపేసుకున్న హీరోయిన్

తెలుగులో "బలుపు", హిందీలో "డి-డే", "రామయ్యా వస్తావయ్యా" చిత్రాల విజయంతో టాప్ హీరోయిన్ గా మారిపోయింది శ్రుతిహాసన్. ప్రస్తుతం ఈ అమ్మడిని గోల్డెన్ లెగ్ గా భావిస్తున్నారు. అందుకే తెలుగు, హిందీ, తమిళ భాషలలో వరుస సినీ అవకాశాలు వస్తున్నాయి. అయితే అసలే బాలీవుడ్ భామ అయిన శృతి.. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ను బాగానే ఫాలో అవుతుంది.

60వ ఐడియా ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో ఈ అమ్మడు అదిరిపోయే విధంగా డాన్స్ చేసి, అందరికి కళ్ళు తన వైపే తిప్పుకునేల చేసింది. అయితే వాళ్ళందరూ ఈ అమ్మడి డాన్స్ కి కాకుండా శృతి వేసుకున్న డ్రెస్ కు దాసోహం అయిపోయారు. ఏంటి నమ్మరా? అయితే ఈ కింద ఉన్న ఫోటో చూడండి. మీకే అర్థం అవుతుంది. పైన పర్లేదు కానీ... కింద వేసుకున్న ప్యాంటు మొత్తం చినిగిపోయినట్లుగా అనిపించే కొత్త స్టైల్ తో వచ్చింది. ఈ దెబ్బకి అక్కడున్నవారికి శృతి డాన్స్ తో పాటు.. కాస్త అందాలు కూడా చూసే చాన్స్ ఇచ్చేయడంతో.. అందరూ కనురెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఎంజాయ్ చేసారు.