English | Telugu
స్పీడ్ పెంచిన చిరంజీవి.. సెకండ్ సాంగ్ లిరిక్స్ విని ఫీల్ అవ్వడం మానండి
Updated : Dec 6, 2025
-అస్సలు ఫీల్ ఎవ్వడు
-ప్రోమోలో ఏముంది!
-చిరంజీవి హంగామా స్టార్ట్
మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జోనర్ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu)ద్వారా సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటడానికి ముస్తాబు అవుతున్నవిషయం తెలిసిందే. పైగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకుడు కావడంతో చిరంజీవిని ఏ విధంగా ప్రెజంట్ చేయబోతున్నాడనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. 2026 సంక్రాంతికి రావడానికి ముహూర్తం దగ్గర పడుతుండటంతో చిత్రీకరణని శరవేగంగా జరుపుకుంటుంది. మరో వైపు మేకర్స్ ప్రమోషన్స్ లో వేగాన్ని కూడా పెంచారు.
ఈ నేపథ్యంలోనే 'మన శంకర వరప్రసాద్ గారు' నుంచి ఈ నెల 8 న 'శశిరేఖ ఓ మాట చెప్పాలి' అనే సాంగ్ రిలీజ్ కాబోతుంది. కొంతసేపటి క్రితం సదరు సాంగ్ ప్రోమో రిలీజ్ అవ్వగా, సదరు ప్రోమోలో చిరంజీవి కొత్త పెళ్లి కొడుకులా పంచెకట్టుతో ముస్తాబయ్యి ఉన్నాడు. కళ్ళ జోడు కూడా ధరించిన చిరంజీవి ఒక అందమైన సెలయేరు లో బోట్ పై వెళ్తూ 'శశిరేఖ నీకో మాట చెప్పాలి. చెప్పాక ఫీల్ కావుగా' అంటున్నాడు. అదే సెలయేరులో మరో బోట్ పై వెళ్తున్న శశిరేఖ(నయనతార) ఫీలవ్వను, ఏంటో చెప్పమని అడుగుతుంది. ఇపుడు ఈ సాంగ్ ప్రోమో అభిమానులని, మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Also Read: షోలే రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. కొత్త క్లైమాక్స్ డిటైల్స్ ఇవే
దీంతో ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్ అంటూ వారంతా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సాంగ్ 'మీసాల పిల్ల' రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మరి శశిరేఖ పూర్తి సాంగ్ రిలీజ్ అయ్యాక మీసాల పిల్లని బీట్ చేస్తుందేమో చూడాలి.