English | Telugu

నెక్స్‌ట్‌ ఏంటి.. కరేబియన్‌ ఐలాండ్‌లో ఐబొమ్మ రెస్టారెంట్‌!

- 17 కోట్ల‌తో 86 దేశాలు చుట్టిన ర‌వి
- క‌రేబియ‌న్ ఐలాండ్ అంత‌టా ఐబొమ్మ రెస్టారెంట్లు
- ఐబొమ్మ సంపాద‌న ఎంజాయ్ చెయ్య‌డానికే

పైరసీతో సినిమా పరిశ్రమను, పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు ఇమ్మడి రవి. పోలీసు కస్టడీలో అనేక వివరాలను రవి నుంచి రాబట్టారు పోలీసులు. అందులో భాగంగానే తన భవిష్యత్‌ ప్రణాళికలను కూడా తెలిపాడు రవి. కరేబియన్‌ దీవుల్లో ఐబొమ్మ పేరుతో ఓ రెస్టారెంట్‌ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు.


ఐబొమ్మ ద్వారా సంపాదించిన 17 కోట్ల రూపాయలు తను ఎంజాయ్ చెయ్యడానికే ఖర్చు చేశానని, ఆ డబ్బుతోనే 86 దేశాలు చుట్టి వచ్చానని చెబుతున్నాడు రవి. ప్రస్తుతం ఐబొమ్మ సైట్‌ను క్లోజ్‌ చేశారు కాబట్టి తన తదుపరి ఆలోచన రెస్టారెంట్‌ అని పోలీసుల విచారణలో రవి తెలిపాడు. ఇండియన్‌ డిషెస్‌ను కరేబియన్‌ ప్రజలకు పరిచయం చెయ్యాలని ఉందని, అందుకే అక్కడ రెస్టారెంట్‌ ప్రారంభించబోతున్నట్టు చెబుతున్నాడు.


కరేబియన్‌ ఐలాండ్‌లోని అన్ని దేశాల్లో ఐబొమ్మ రెస్టారెంట్‌ బ్రాంచ్‌లను విస్తరిస్తానని అంటున్నాడు రవి. ఇప్పటికే అతన్ని రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు.. అతనికి సంబంధించిన 3 కోట్ల రూపాయలను సీజ్‌ చేశారు. అయితే కోర్టులో ఈ కేసు విచారణ ఎలా ఉంటుంది? రవి తరఫు న్యాయవాది వాదన ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇమ్మడి రవి కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది, కోర్టు తీర్పు ఎలా వుండబోతుంది అనే విషయాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.